ఆ ప్రమాదం నాకు జరగాల్సింది, తప్పించుకున్నాను: టక్కరి దొంగ హీరోయిన్

లీసా రే గుర్తుందా? అదేనండీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘టక్కరి దొంగ’లో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి. ఇప్పుడు ఆమె పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితం అయిపోయిందనుకోండి. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో బాధపడి కోలుకున్న లీసా ఇప్పుడు తన జీవితం ప్రజలకు తెలియాలని ఆటో బయోగ్రఫీ రాసింది. ఈ బుక్‌కు ‘క్లోజ్ టు ది బోన్’ అనే పేరు పెట్టింది. నిన్న ముంబయిలో ఈ బుక్‌ను లాంచ్ చేసింది. ఈ సందర్భంగా లీసా మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన షాకింగ్ సంఘటనల గురించి వెల్లడించారు.

‘ఓసారి 1991లో నా ఫ్యామిలీతో కలిసి బాంబేలో వెకేషన్‌కు వెళ్లాం. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి మోడలింగ్ చేస్తారా అని అడిగారు. నేను ఎగ్జైట్ అయ్యి ఓకే అన్నాను. ఆ తర్వాత ఓ ఫొటో స్టూడియోకు వెళ్లి ఫొటోలు తీయించుకున్నాను. ఆ తర్వాత కెనడా వెళ్లిపోయాను. కెనడాకు వెళ్లిన కొద్ది రోజల్లోనే మేం ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. మా అమ్మా ఇక జీవితంలో నడవలేదని డాక్టర్లు చెప్పారు. నా అదృష్టమో ఏమో కానీ కార్లో మా అమ్మ కూర్చున్న సీట్లో నేను కూర్చోవాల్సింది. కానీ సీట్లు మార్చుకున్నాం. లేకపోతే నాకు కెరీరే ఉండేది కాదు. ఆ తర్వాత నేను దిగిన ఫొటోలను ఎవరో మ్యాగజైన్‌లో ప్రింట్ చేయించారు. అలా నా మోడలింగ్, సినీ కెరీర్ స్టార్ట్ అయింది. ఇక నా క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పాలంటే.. చికిత్స చేయలేం ప్రమాదకరమైన స్థాయిలో ఉందని డాక్టర్ చెప్పాడు’

నాకు క్యాన్సర్ సోకడానికి ఆరు నెలల ముందు నా బాడీ నాకు సిగ్నల్స్ ఇస్తూనే ఉంది. కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేనున్న ప్రొఫెషన్ అలాంటిది. ఈ ప్రొఫెషన్‌లో ఒంట్లో బాలేకపోతే ఇంటికి వెళ్లిపోవడానికి కుదరదు. దాంతో విపరీతంగా మెడిసిన్స్ వేసుకునేదాన్ని. ఆ తర్వాత నాకు క్యాన్సర్ సోకిందని తెలిసి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకున్నాను. నేను చనిపోను అని నాకు తెలుసు. కానీ ట్రీట్మెంట్ జర్నీ కూడా సులువైంది కాదు. అలా ఈ వ్యాధి నుంచి కోలుకోగలిగాను’ అని చెప్పుకొచ్చింది లీసా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This