గుండె భాష వినండి- ప్రమాదాన్ని ముందే పసిగట్టండి

గుండెజబ్బు అనగానే ఛాతీలో నొప్పి, చెమట్లు పట్టటం, ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి కావటం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి. అందరిలోనూ ఇలాంటి స్పష్టమైన, కచ్చితమైన లక్షణాలే ఉండాల్సిన అవసరం లేదు. కొందరిలో ఇతరత్రా లక్షణాలూ పొడసూపొచ్ఛు చాలాసార్లు ఇవి మామూలువనే అనిపించొచ్ఛు పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, అసలివి సమస్యలే కావనీ అనిపించొచ్ఛు నిస్సత్తువ, దవడ నొప్పి, భుజం నొప్పి, ఆయాసం, కాళ్ల వాపులు, గుండెదడ వంటివి అలాంటి సంకేతాలే. నిజానికి చాలావరకివి ఇతర జబ్బుల ఆనవాళ్లే అయ్యిండొచ్ఛు అంతమాత్రాన గుండెతో సంబంధం లేవివని పూర్తిగా కొట్టిపారెయ్యటానికీ లేదు. తరచి చూస్తే గానీ అసలు విషయం బయట పడదు. కొన్నిసార్లు ఇవి రోజులు, నెలల ముందు నుంచే కనిపిస్తుండొచ్ఛు ఛాతీలోనొప్పి వంటి స్పష్టమైన లక్షణాలతో పోలిస్తే ఇతరత్రా లక్షణాలు కనిపించేవారే ఎక్కువ. వీటిని కాస్త లోతుగానే పరిశీలించాల్సి ఉంటుంది. మామూలు సమస్యలైతే ఇబ్బందేమీ లేదు గానీ గుండె జబ్బుతో ముడిపడినవైతే ముందే జాగ్రత్త పడొచ్ఛు సమస్య ముదరకుండా, ప్రాణాంతకంగా పరిణమించకుండా కాపాడుకోవచ్ఛు

గుండె భాష వింటున్నారా?

వేగంగా, బలమైన పనులు చేసినప్పుడు ఆయాసం రావటం మామూలే. ఇదేమీ పెద్ద ఇబ్బందికరమైంది కాదు. అంతమాత్రాన తేలికగా తీసుకోవటానికీ లేదు. అధిక బరువు, ఊబకాయం, రక్తహీనత వంటి సమస్యల్లోనే కాదు.. గుండె జబ్బులోనూ ఆయాసం రావొచ్ఛు చాలామంది దీన్ని మామూలు ఇబ్బందిగానే పొరపడుతుంటారు. కొందరైతే ఆయాసం వస్తుందని పనులను నెమ్మదిగానూ చేస్తుంటారు. ఉదాహరణకు గబగబా మెట్లు ఎక్కేవాళ్లు ఇప్పుడు నెమ్మదిగా ఎక్కుతుండొచ్ఛు దీన్ని విస్మరించటానికి వీల్లేదు. ముఖ్యంగా.. రోజూ సునాయాసంగా చేసే పనుల్లోనూ కొత్తగా ఆయాసం వస్తున్నట్టయితే తప్పకుండా ఆలోచించాల్సిందే. మన శ్వాస, గుండె పంపింగ్‌ సామర్థ్యం ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటాయి. గుండె సరిగా రక్తాన్ని పంప్‌ చేయలేకపోతే కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందక ఆయాసానికి దారితీస్తుంది. రక్తనాళాల్లో పూడికల మూలంగా గుండెకు తగినంత రక్తం సరఫరా కాకపోయినా ఇబ్బందే. దీంతో గుండె మరింత ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా గుండె కండరం మందంగా, గట్టిగా తయారవుతుంది. పంపింగ్‌ సామర్థ్యమూ తగ్గుతుంది. గుండె బలంగా పనిచేస్తుంటేనే ఊపిరితిత్తుల్లోని రక్తం పూర్తిగా గుండెకు చేరుకుంటుంది. లేకపోతే కొంత రక్తం ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతుంది. దీంతో క్రమంగా ఊపిరితిత్తుల్లో ద్రవాలు పోగుపడి ఆయాసం తలెత్తుతుంది. గుండె కవాట సమస్యలూ దీనికి దారితీయొచ్ఛు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This