అలసటా?.. తేలిగ్గా తీసుకోవద్దు!

45 ఏళ్లు దాటిన తర్వాత.. వచ్చే అలసటని చాలామంది మెనోపాజ్‌ లక్షణమేమో అని తేలిగ్గా తీసుకుంటారట. కానీ అది భవిష్యత్తులో రాబోయే గుండెనొప్పి తాలుకూ లక్షణం కూడా కావచ్చు అంటున్నాయి తాజా పరిశోధనలు. ‘గుండెనొప్పి మగవాళ్లకే వస్తుంది.. ఆడవాళ్లకు రాదేమో’ అనేంత అవగాహనా రాహిత్యం మనలో చాలామందికి ఉంది.

కానీ తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే.. స్త్రీలు గుండెనొప్పి లక్షణాలని నీరసం అనుకునో, మెనోపాజ్‌ త్వరగా వచ్చిందనో పొరపడతున్నారట. అందుకే 45 దాటిన తర్వాత శరీరంలోంచి వేడి ఆవిర్లు రావడం, చికాకు, నిస్సత్తువ, నిరాసక్తంగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తే వాటిని మెనోపాజ్‌ లక్షణాలుగా భావించి సరిపుచ్చుకోకుండా వైద్యులకు చూపించుకోవాల్సిన అవసరం ఉందని యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌లో వచ్చిన ఓ కథనం పేర్కొంటోంది. అలాగే పీసీఓఎస్‌ వంటి సమస్యలతో గర్భం రావడం ఆలస్యం అయితే అది కూడా తర్వాత కాలంలో గుండెజబ్బులకి దారి తీయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This