యువకుడి రక్తంలో పుట్టగొడుగులు- అసలేమైంది?

‘వైద్యో నారాయణో హరి’ అంటారు పెద్దలు. ఏదైనా వ్యాధి సోకితే వైద్యులను సంప్రదించాల్సిందే. వారు సూచించిన మందులు వాడితేనే వ్యాధి నుంచి త్వరగా కోలుకోగలం. అలా కాదని కొందరు సొంత వైద్యం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రతి దాన్ని ఇంటర్నెట్‌లో శోధించి సొంతంగా తెలుసుకునే అలవాటు ప్రజల్లో బాగా పెరిగిపోయింది. ఇది మంచిదే. కానీ, వైద్యం విషయంలోనూ ఇంటర్నెట్‌పై ఆధార పడటం ఎంత ప్రమాదకరమో ఇటీవల ఓ జర్నల్‌లో ప్రచురించిన సంఘటన తెలియజేస్తుంది. మానసిక రోగంతో బాధపడుతున్న ఓ యువకుడు వైద్యులు సూచించిన మందులు కాకుండా ఇంటర్నెట్‌లో చూసి సొంత వైద్యం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

జర్నల్‌ ఆఫ్‌ ది అకాడమీ ఆఫ్‌ కన్సల్టేషన్‌ – లియసన్‌ సైకియాట్రీ కథనం ప్రకారం.. ఓ 30 ఏళ్ల యువకుడు(బాధితుడి వివరాలు వెల్లడించలేదు) మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. అయితే, వాటి నుంచి బయటపడాలన్న ప్రయత్నంలో మానసిక వ్యాధికి గురయ్యాడు. అతడికి బైపోలార్‌ డిజార్డర్‌ కూడా ఉంది. దీంతో వైద్యులు అతడికి కొన్ని మందులు సూచించారు. కానీ, ఆ యువకుడు వాటిని వేసుకోవడం మానేసి సొంత వైద్యంపై దృష్టి పెట్టాడు. ఈ మేరకు ఇంటర్నెట్‌లో ఆన్వేషించగా.. మానసిక ఆందోళనను, ఒత్తిళ్లను దూరం చేయడంలో సిలోసెబిన్‌ పుట్టగొడుగులు ఉపయోగపడతాయని తెలుసుకున్నాడు. వాటిని మ్యాజిక్‌ మష్‌రూమ్స్‌ అని కూడా పిలుస్తుంటారు. నిజంగానే ఈ రకం పుట్టగొడుగులకు ఔషధ లక్షణాలు ఉన్నాయి. వీటితో వైద్యులు మెడికల్‌ ట్రయల్స్‌ కూడా చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This