గుంటూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన

గుంటూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. తాడేపల్లి మండలం గుండిమెడ నుంచి ఆయన పర్యటన ప్రారంభమైంది. కృష్ణా నది వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను లోకేశ్ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు.

మినప పంట వేసేందుకు పెట్టిన పెట్టుబడుల గురించి ఆరా తీశారు. వరుసగా వస్తున్న వరదలు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయని రైతులు వాపోయారు. మంగళగిరి, తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో లోకేశ్​ పర్యటన సాగనుంది. ఆయన వెంట మాజీమంత్రులు ఆలపాటి రాజా నక్కా ఆనంద బాబు, ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This