‘బెవ్​ క్యూ’ ​యాప్​తో ఇకపై ఇంటివద్దకే మద్యం!

మద్యం విక్రయంలో కేరళ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆన్​లైన్​లో మద్యం అమ్మకాలు జరిగేలా ‘బెవ్​ క్యూ’ అనే సరికొత్త యాప్​ను అభివృద్ధి చేసింది. తాజాగా గూగుల్​ నుంచి అనుమతి పొందిన ఈ యాప్​.. త్వరలోనే గూగుల్​ ప్లే స్టోర్​లో అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వ బేవరేజెస్​ కార్పొరేషన్​(బెవ్​కో) ద్వారా రాష్ట్రంలో ఆన్​లైన్​ అమ్మకాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

గూగుల్​ నుంచి ఆమోదం పొందడంలో ఆలస్యం కావడం వల్ల.. గతవారమే ప్రారంభం కావాల్సిన మద్యం అమ్మకాలు వాయిదా పడ్డాయి. అసలు ఎలాంటి అనుభవం లేని సంస్థకు యాప్​ను అభివృద్ధి చేసే ప్రాజెక్టును ప్రభుత్వం అప్పగించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎట్టకేలకు మందుబాబులకు ఉపశమనం కలిగించేందుకు ‘బెవ్​ క్యూ’ యాప్​ సిద్ధమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This