చిన్నారి మృతి బాధాకరం.. ప్రగాఢ సంతాపం: గవర్నర్

మెదక్​ జిల్లాలో బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్​ మృతి పట్ల గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ఆవేదన వ్యక్తం చేశారు. సాయివర్ధన్​ను కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి జిల్లాలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్నారి తల్లిదండ్రులకు సానుభూతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This