వరుస గ్యాస్​ లీకేజీ ఘటనలు బాధాకరం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరవాడలో రియాక్టర్ నుంచి బెంజీన్ లీకేజీపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ లీకేజీ మరువక ముందే పరవాడ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధాకరమన్నారు.

విశాఖలో వరుస గ్యాస్ లీకేజీలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని.. బాధితులకు వెంటనే అత్యున్నత వైద్యసాయం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This