ఇండేన్​ గ్యాస్​ బుకింగ్​కు ఒకే ఫోన్​ నంబర్​

ఇండేన్‌ గ్యాస్‌ సిలిండర్‌ (ఎల్‌పీజీ) రీఫిల్‌ బుకింగ్‌కు దేశవ్యాప్తంగా ఒకే ఫోన్‌ నంబర్‌ను నవంబరు1 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీ) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌పీ ఫుల్‌జిలే తెలిపారు. ఆంధ్రప్రదేశ్​ విజయవాడలోని ఐఓసీ కార్యాలయం వేదికగా శుక్రవారం ఆయన తెలిపారు.

ఇప్పటివరకు ప్రాంతాలవారీగా రీఫిల్‌ బుకింగ్‌ చేసుకునేందుకు వివిధ ఫోన్‌నంబర్లు ఉండేవని, నవంబరు ఒకటి నుంచి 77189 55555 నంబర్‌ ద్వారా బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This