‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజనను ఏపీకీ వర్తింపజేయండి’

గ్రామీణ భారతంలో జీవనోపాధిని పెంపొందించే ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పథకాన్ని ఏపీకీ వర్తింపజేయాలని కోరుతూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్​నాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. లాక్ డౌన్ తో స్వగ్రామాలకు చేరుకున్న ఏపీ వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని లేఖలో కోరారు. 6 రాష్ట్రాల్లో 116 జిల్లాలకు వర్తింపచేస్తూ 50 కోట్ల ప్యాకేజీ అందించడం హర్షణీయమన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. శ్రీకాకుళంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన లక్షలాది వలస కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతునట్లు లేఖలో వివరించినట్టు ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This