వన్డే, టీ20ల్లో రైనా కీ ప్లేయర్: గంగూలీ

పరిమిత ఓవర్ల క్రికెట్​లోని కీలక ఆటగాళ్లలో సురేశ్ రైనా ఒకడని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. తన అద్భుత బ్యాటింగ్​తో, లోయర్ ఆర్డర్​లో వచ్చి ఎన్నో మ్యాచ్​ల్ని గెలిపించాడని గుర్తు చేశాడు. రైనాతో పాటు అతడి కుటుంబానికి ఆల్​ ది బెస్ట్ చెప్పాడు.

శనివారం సాయంత్రం ధోనీ రిటైర్మెంట్​ ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే రైనా కూడా అదే బాటలో నడిచాడు. ఇతడి వీడ్కోలును బీసీసీఐ కూడా ఆదివారం ధ్రువీకరించింది.​

2005లో 19 ఏళ్ల వయసులో శ్రీలంకతో వన్డేతో రైనా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మొత్తంగా భారత్​ తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టెస్టులు ఆడాడు.2011 వన్డే ప్రపంచకప్​ బృందంలోనూ సభ్యుడే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This