బుడగలో ఉండటం ఆటగాళ్లకు సవాలే: గంగూలీ

బయోబబుల్​లో దీర్ఘకాలం ఉంటూ క్రికెట్​ ఆడటం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఐపీఎల్​ను విజయవంతం చేసిన ఆటగాళ్లకు అతను కృతజ్ఞతలు చెప్పాడు.

“బీసీసీఐ తరఫున ప్రతి ఐపీఎల్​ జట్టులోని ఆటగాళ్లకూ ధన్యవాదాలు. బబుల్​లో ఉంటూ క్రికెట్​ ఆడటం మానసికంగా సవాలు విసురుతుంది. ఈ పరిస్థితుల్లో అందరూ గొప్ప నిబద్ధత చూపించారు.”

— సౌరభ్​ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

కరోనా కారణంగా యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్​లో పాల్గొన్న టీమ్​ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటన కోసం బయలుదేరనుంది. అక్కడే క్వారంటైన్​లో ఉంటూ ప్రాక్టీస్​ చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This