జీ-7 సదస్సు: భారత్‌కు ఆహ్వానం.. అయినా ఆచితూచి..

సంపన్న దేశాల సమాహారమైన జీ-7 కూటమిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. కెనడా, ఫ్రాన్స్‌, అమెరికా, ఇటలీ, జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌లతో కూడిన ఈ కూటమి జూన్‌ మొదటివారంలో నిర్వహించాల్సిన సదస్సును కొవిడ్‌ నేపథ్యంలో సెప్టెంబరుకు వాయిదా వేసినప్పటికీ- అందులో పాల్గొనాలని భారత్‌కు ఆహ్వానం పంపించడమే విస్తృత చర్చకు తెరలేపింది.

రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను సైతం ఆ సదస్సుకు ఆహ్వానిస్తామని- ఆ రకంగా కూటమిని జి-10గానో లేదా జి-11గానో రూపాంతరీకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నారు. ప్రపంచంలోని 11శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న జి-7 కూటమి, అంతర్జాతీయ నికర ఆదాయంలో 58శాతానికి (317 లక్షల కోట్ల డాలర్లు), ప్రపంచ స్థూలోత్పత్తిలో 46శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ దేశాల చురుకైన వాణిజ్య భాగస్వామిగా జి-7 కూటమి మూడింట ఒకవంతు ఎగుమతులకు, 35శాతం వస్తు సేవల దిగుమతులకు కేంద్రంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This