20 ఏళ్ల బంధానికి ఫుట్​బాలర్ మెస్సీ ముగింపు!

ఎఫ్​సీ బార్సిలోనాతో ఉన్న 20 ఏళ్ల బంధానికి స్టార్ ఫుట్​బాలర్ లియో మెస్సీ ముగింపు పలకాలని భావిస్తున్నాడు. సదరు యాజమాన్యానికి ఫ్యాక్స్ కూడా పంపాడు. అయితే కాంట్రాక్ట్​లో ఉన్న నిబంధనను సడలించి, తనకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని పేర్కొన్నాడు. క్లబ్ మాత్రం, మెస్సీ తన కెరీర్​ చివరి వరకు తమతోనే ఉండాలని కోరుకుంటోంది.

2000లో బార్సిలోనాలో చేరిన మెస్సీ.. ఇప్పటివరకు 10 లాలిగా టైటిల్స్​తో పాటు నాలుగుసార్లు యూఈఎఫ్​ఏ ఛాంపియన్స్ లీగ్​ టైటిల్​ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఫార్వర్డ్​గా ఎన్నో గోల్స్ కొట్టి క్లబ్ విజయాల్లో భాగమయ్యాడు. ఆరుసార్లు గోల్డెన్ బూట్​ను సొంతం చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This