ఫుట్​బాల్ ప్లేయర్​కు అనారోగ్యం​.. అండగా క్రీడాశాఖ

మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న భారత యువ ఫుట్​బాల్ ప్లేయర్ రామానంద నింగ్​కు.. క్రీడా మంత్రిత్వ శాఖ రూ.5లక్షలు ఆర్థిక సాయం చేసింది. పండిట్​ దీనదయాల్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ నిధి కింద వాటిని అందజేసింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ట్వీట్ చేశారు.

రిక్షావాలా కుమారుడైన రామానంద.. ప్రస్తుతం మణిపుర్​లోని షీజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని చూపు కూడా మసకబారుతున్నట్లు వైద్యులు తెలిపారు. 2017లో గౌహతిలో జరిగిన అండర్​-17 ఆసియా ఛాంపియన్​షిప్​లో.. రామానంద భారత్​కు ప్రాతినిధ్యం వహించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This