ఐపీఎల్​లో మెస్సీ.. ఫ్రాంచైజీల క్లారిటీ!

ఫుట్​బాల్​ స్టార్​ ప్లేయర్​ లియోనల్​ మెస్సీ మంగళవారం సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. బార్సిలోనా క్లబ్​తో తన ఒప్పందాన్ని ముగిస్తున్నట్లు స్పష్టం చేశాడు. తన కెరీర్​ ప్రారంభం నుంచి ఈ క్లబ్​లోనే గడిపిన మెస్సీ.. అంతర్గత గందరగోళాల కారణంగా బార్సిలోనాను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇతడి కోసం ఇప్పటికే పలు జట్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ విషయంపై ఐపీఎల్​ ఫ్రాంచైజీ కోల్​కతా నైట్​రైడర్స్​ ఆసక్తికర ట్వీట్​ చేసింది. ఐపీఎల్​ 13వ సీజన్​లో మెస్సీ కేకేఆర్​ జెర్సీ ధరించాలనుకుంటున్నారా? అని పోస్ట్​ చేసింది.

బార్సిలోనాకు వీడ్కోలు పలికిన తర్వాత మెస్సీ ఏ క్లబ్​లో చేరతాడనే ప్రశ్నకు.. కేకేఆర్​.. “మిస్టర్​ మెస్సీ.. మా జెర్సీని ధరించడానికి మీరేమంటారు? ” అంటూ పోస్ట్​ చేసింది. కోల్​కతా నైట్​రైడర్స్​తో పాటు దిల్లీ క్యాపిటల్స్​, కేరళ బ్లాస్టర్స్​ జట్లు కూడా మెస్సీ గురించి ట్వీట్లు చేశాయి. ఇటీవల వస్తున్న పుకార్ల నేపథ్యంలో లియోనల్​ మెస్సీని తాము వేలంలో కొనలేదని దిల్లీ క్యాపిటల్స్​ ధ్రువీకరించింది.

మాంచెస్టర్​ సిటీ, పారిస్​ సెయింట్​-జర్మైన్​, ఇంటర్​ మిలాన్​ క్లబ్​లతో మెస్సీ సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆటగాళ్లకు ఇచ్చే జీతాల్లోనూ ఈ జట్లు ముందున్నాయి. అందువల్ల వీటిలో ఒక జట్టు మెస్సీని చేజిక్కించుకుంటుందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This