విమానంలో ఇద్దరికి కరోనా.. ప్రయాణికుల్లో గందరగోళం

దిగ్గజ విమాన సంస్థ స్పైస్​జెట్​లో ప్రయాణించిన ఇద్దరికి కరోనా​ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో విమాన సిబ్బంది సహా బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్​ కేంద్రాలకు తరిలించినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది.

మే 25న ఎస్​జీ-8194లో అహ్మదాబాద్​ నుంచి దిల్లీ, ఎస్​జీ-8152లో దిల్లీ నుంచి గువాహటికి వెళ్లిన ఇద్దరు ప్రయాణికుల్లో వైరస్​ లక్షణాలు బయటపడ్డాయి. అనంతరం.. వారిని క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు. మే 27న వచ్చిన ఫలితాల్లో.. కరోనా పాజిటివ్​ అని తేలినట్లు స్పైస్​జెట్​ విమాన సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే.. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, ప్రయాణికులకు మాస్క్​లు, శానిటైజర్​లు పంపిణీ ఇస్తున్నామని చెప్పారు.

ఇటీవల విమానయానం చేస్తున్న వారిలో వైరస్​ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇండిగో, అలియన్స్​ ఎయిర్​ విమానాల్లో కరోనా కేసులు బయట పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This