ఎయిరిండియాకు టాటాల టేకాఫ్‌?

అంతకంతకూ నష్టాల్లో కూరుకుపోతున్న ఎయిరిండియా ప్రభుత్వ సాయంతో మాత్రమే ఎగరగలుగుతోంది. 2011-12 నుంచి రూ.30,000 కోట్లు చొప్పించినా, ప్రయోజనం లేకపోవడంతో, విక్రయించాలనే కచ్చిత నిర్ణయానికి వచ్చింది. అయితే అలవికాని షరతులు ప్రకటించడంతో, 2018 నుంచి ప్రయత్నిస్తున్నా ఎయిరిండియాను కొనేందుకు ఏ సంస్థా ముందుకు రాలేదు. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం, కూడా వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తోంది. ఆస్తులతో సహా ఎయిరిండియాలో 100 శాతం వాటా విక్రయానికి ఈ ఏడాది జనవరి 27 నుంచి తీవ్రంగా యత్నిస్తూ, బిడ్ల దాఖలుకు గడువును ఇప్పటికి 4 సార్లు పొడిగించి, అక్టోబరు 30గా చేసింది. అర్హత కలిగిన బిడ్డర్లకు సమాచారం ఇచ్చే గడువును నవంబరు 20గా నిర్ణయించారు. ప్రవాస భారతీయులు 100 శాతం వాటా కొనుగోలుకు వీలు కల్పించినా, దేశీయ సంస్థకే మెజారిటీ వాటా, యాజమాన్య హక్కులు ఉండాలనే షరతు మాత్రం ఉంచింది. అంటే 49 శాతం వాటాను విదేశీ సంస్థలు అట్టేపెట్టుకుని, దేశీయ భాగస్వామ్య సంస్థకు 51 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. హిందూజా గ్రూప్‌, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, టాటా గ్రూప్‌ సంస్థలు ఎయిరిండియాపై ఆసక్తి చూపుతున్నాయని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This