నర్సింగ్​ హోంలో అగ్ని ప్రమాదం- 15 మంది మృతి

ఉక్రెయిన్​ ఖర్కివ్​ నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్​ హోంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 15మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు అంతస్తుల నర్సింగ్​హోంలో ఉన్న రోగులందరూ బలహీనంగా ఉంటారని, ఆ వృద్ధ మహిళలకు కనీసం నడవడానికి కూడా శక్తి ఉండదని స్థానికులు తెలిపారు.

అయితే ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. నివాస భవనాన్నే నర్సింగ్​హోంగా మార్చి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇది అధికారికంగా రిజిస్టర్​ కాలేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This