రైతులకు భరోసా లేదు.. అందుకే వ్యతిరేకిస్తున్నాం: నిరంజన్ రెడ్డి

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్​ గౌడ్​ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే వ్యవసాయ మార్కెట్ చట్టం రైతులకు భరోసా కలిగించేలా లేదని… అందుకే తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్టు నిరంజన్​రెడ్డి అన్నారు. చట్టాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి రాజీనామా చేసినా… ప్రభుత్వం వెనకడుగు వేయకపోవడాన్ని రైతులు గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆరోపించారు. విస్తారంగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, రైతు వేదికల ద్వారా అవసరమైన సేవలందిస్తామన్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి ఐకమత్యంగా కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. మార్కెట్​ ఆవరణలో నూతన కాంప్లెక్స్​ నిర్మాణానికి, కౌకుంట్ల మండల ఏర్పాటుకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంతో మంత్రులు హామీ ఇచ్చారు. అంతకుముందు… మార్కెట్​ కమిటీ ఛైర్​పర్సన్​గా కొండా సుగుణ, వైస్​ ఛైర్మన్​గా రమేష్​తోపాటు డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ సహాయ సంచాలకులు పద్మ హర్ష , జిల్లా వ్యవసాయ అధికారి భాస్కరయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This