ఇంజినీరింగ్‌ ప్రవేశాల గడువు నవంబరు 15

బీటెక్‌, బీఫార్మసీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలను నవంబరు 15వ తేదీలోపు పూర్తిచేయాలని ఏఐసీటీఈ ఛైర్మన్‌ సహస్రబుద్ధే తెలిపారు. ఆయన తాజాగా దేశంలోని సాంకేతిక విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. దాదాపు 120 వర్సిటీల ఉపకులపతు(వీసీ)లు, రెక్టార్లు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. జేఎన్‌టీయూహెచ్‌ నుంచి రెక్టార్‌ ఆచార్య గోవర్ధన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ సహస్రబుద్ధే పలు అంశాలపై తాజా ఆదేశాలిచ్చారు. వీటిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

మూడున్నర నెలలు ఆలస్యంగా తరగతులు

  • అక్టోబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాలని, ప్రవేశాలను అదే నెల 20వ తేదీ నాటికి పూర్తి చేసుకోవాలని ఏఐసీటీఈ గత నెల 7న కాలపట్టిక జారీ చేసింది. అయితే ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమవుతున్నందున వాటికి రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే గందరగోళం ఉండదని ఛైర్మన్‌ స్పష్టత ఇచ్చారు. దీంతో బీటెక్‌, బీఫార్మసీ ప్రవేశాల గడువును నవంబరు 15 వరకూ పొడిగించారు. నవంబరు రెండో వారంలో తరగతులు మొదలవుతాయి. ఈ లెక్కన విద్యా సంవత్సరం మూడున్నర నెలల ఆలస్యంగా ప్రారంభమవుతుంది.
  • పాత విద్యార్థులకు ఈ నెల 17 నుంచి సెప్టెంబరు 1వ తేదీ లోపు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని ఛైర్మన్‌ ఆదేశించారు. చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు గతంలో నిర్దేశించినట్లుగా సెప్టెంబరు 30వ తేదీ లోపు పరీక్షలు పూర్తి చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This