హవాలా కేసులో కాంగ్రెస్​ నేతపై ఈడీ ప్రశ్నల వర్షం

మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్​ పటేల్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. సందేశారా కుంభకోణానికి సంబంధించి మూడోసారి విచారించేందుకు గరువారం ఉదయం 11.30 గంటలకు అహ్మద్ పటేల్ నివాసానికి వెళ్లిన అధికారులు రాత్రి 10 గంటలకు బయటికి వచ్చారు.

సందేశారా సోదరుల బ్యాంకు కుంభకోణంలో సంబంధాలున్నట్లు పటేల్​పై ఆరోపణలు ఉన్నాయి. విచారణకు సంబంధించి మీడియాతో మాట్లాడారు అహ్మద్ పటేల్.

“దర్యాప్తు బృందం మొత్తం 128 ప్రశ్నలు అడిగింది. నన్ను, నా కుటుంబాన్ని వేధించేందుకు రాజకీయంగా ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు బృందం ఎవరి ఒత్తిడితో పనిచేస్తుందో నాకు తెలియదు. వాళ్లు ఎన్ని రోజులైనా ప్రశ్నించుకోవచ్చు. నేను సిద్ధంగా ఉన్నా. అక్కడ ఎలాంటి అక్రమాలు జరగకున్నా, సరైన ఆధారాలు లేకున్నా ఎవరో చెబితేనే ఈడీ ఈ విధంగా వ్యవహరిస్తోంది.”

– అహ్మద్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నేత

కరోనా నేపథ్యంలో..

ఇప్పటివరకు అహ్మద్​ పటేల్​ను జూన్ ​27, 30 తేదీల్లో రెండు రౌండ్లలో కలిపి 17 గంటల పాటు 70 ప్రశ్నలు అడిగారు ఈడీ. కరోనా నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి వచ్చేందుకు నిరాకరించిన పటేల్​.. తన ఇంట్లో విచారణకు అంగీకరించారు.

దర్యాప్తునకు ముగ్గురు ఈడీ అధికారులతో కొంతమంది వెళ్లారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాస్కు, గ్లౌజులు, శానిటైజర్లు వెంటతీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. తాజా విచారణలో అహ్మద్ పటేల్ వాంగ్మూలాన్ని హవాలా కేసు కింద రికార్డు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This