‘ఖర్చులు పెంచితేనే ఆర్థిక వృద్ధి’

మెరుగైన పరిస్థితులు చూడొచ్చు..

వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు మెరుగవ్వచ్చని భానుమూర్తి అంచనా వేశారు. వచ్చే ఏడాది భారత్ భారీ వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనాలు వస్తున్నాయన్నారు. కొన్ని రేటింగ్ ఏజెన్సీలు ఏకంగా రెండంకెల వృద్ధి రేటును కూడా అంచనా వేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

‘అదే నిజమైతే.. వచ్చే ఆర్థిక సంవత్సరం మెరుగైన ఆదాయ పరిస్థితులను చూడొచ్చు. వ్యయాల, ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించుకునేందుకు అర్థిక శాఖకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు.

లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వం భారీ ఉద్దీనను ఎంచుకోలేదు కాబట్టి.. వ్యయాలు పెంచేందుకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని భానుమూర్తి వివరించారు.

‘తీవ్ర మాంద్యంలో ఉన్నప్పటికీ.. ఇంతకు ముందు అంచనా వేసినదానికంటే.. కాస్త మెరగైన ద్రవ్య లోటు సంఖ్యలను చూస్తున్నాం.’ అని భానుమూర్తి అన్నారు. పన్ను రేట్లు తగ్గించడం కూడా ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ముందున్న ఉత్తమ మార్గమని చెప్పారు. ముఖ్యంగా జీఎస్​టీ రేట్లు తగ్గిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This