ఎంసెట్‌ వాయిదా!

రాష్ట్రంలో ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదాపడనున్నాయి. ప్రస్తుతం ఇంటరీ్మడియెట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు రద్దయిన నేపథ్యంలో విద్యార్థులు ఇక ఎంసెట్‌పై దృష్టి సారించనున్నారు. ఇన్నాళ్లూ సెకండియర్‌ పరీక్షలు ఉంటాయా? లేదా? అన్న ఆందోళనలో ఉన్న విద్యార్థులకు ఇప్పటికిప్పుడు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. పైగా కరోనా కూడా అదుపులోకి రాలేదు. ఈనేపథ్యంలో విద్యార్థులు ఎంసెట్‌కు సిద్ధమయ్యేందుకు కనీసం 6 వారాల గడువు ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అందుకు అనుగుణంగానే వచ్చే నెల 5 నుంచి 9 వరకు (5, 6 తేదీల్లో అగ్రికల్చర్, 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్‌) నిర్వహించాల్సిన ఎంసెట్‌ను వాయిదా వేయాలన్న భావనకు వచి్చంది. త్వరలోనే సవరించిన షెడ్యూల్‌ను జారీ చేసే అవకాశం ఉంది. వీటిపై ప్రభుత్వంతో చర్చించాకే తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యా మండలికి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్‌ స్లాట్స్‌ను బట్టి పరీక్ష తేదీలను ఖరారు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This