దుబే ఎన్​కౌంటర్​ స్పాట్​లో ‘సెల్ఫీ’ మోత

గ్యాంగ్​స్టర్​ వికాస్​ దుబే ఎన్​కౌంటర్​ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అయితే అతడిని ఎన్​కౌంటర్​ చేసిన ప్రదేశం కూడా సంచలనంగా మారింది. దుబే మరణ వార్త విన్న అనంతరం స్థానిక ప్రజలు ఘటనాస్థలానికి భారీగా తరలివెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఎగబడ్డారు.

8మంది పోలీసులను హత్య చేసిన గ్యాంగ్​స్టర్​ దుబేను గురువారం మధ్యప్రదేశ్​ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం శుక్రవారం ఉత్తరప్రదేశ్​లోని కాన్పుర్​ శివార్లలో జరిగిన ఎన్​కౌంటర్​లో దుబే హతమయ్యాడు. తమ వద్ద నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరుపుతూ పారిపోతుండగా.. ఆత్మరక్షణ కోసం అతడిని ఎన్​కౌంటర్​ చేశారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This