డ్రగ్స్ కేసు: డ్యాన్సర్ కిశోర్​ శెట్టి అరెస్ట్

శాండిల్​వుడ్ ప్రముఖ డ్యాన్సర్​​, నటుడు కిశోర్​ అమన్​ అలియాస్​ కిశోర్​ శెట్టిని శనివారం మంగుళూరు క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్​ తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. కిశోర్​ను అదుపులోకి తీసుకున్నారు.

కిశోర్​ హిందీ చిత్రం ‘ఏబీసీడీ’లో నటించాడు. జీ టీవీ ‘డ్యాన్స్​ ఇండియా డ్యాన్స్’ టెలివిజన్​ రియాలిటీ షో సీజన్​2లో పాల్గొని 8వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఇప్పటికే శాండల్​వుడ్​ డ్రగ్స్​ రాకెట్​ కేసులో పలువురు సినీ ప్రముఖులను అరెస్ట్ చేశారు సీసీబీ అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This