ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై కేసీఆర్ వైఖరి చెప్పాలి: డీకే అరుణ

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై సీఎం కేసీఆర్‌ తన వైఖరి స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె సీఎంకు లేఖ రాశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాను తెలంగాణలో అమలు చేయకుండా కేంద్రంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకోవడం మీ పాలసీనా? అని నిలదీశారు.

కేంద్రం ఓబీసీతో పాటు అన్నివర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేస్తుందనడానికి నీట్‌-2019 ప్రవేశాలే నిదర్శనమని తెలిపారు. మీ పార్టీనేతలు తప్పుడు ప్రకటనలు ఇవ్వడం ఇకనైనా మానుకోవాలని హితవు చేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేవిధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This