నేను భారతీయుడినే.. ఇదిగో రుజువు: దిల్జిత్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు ప్రముఖ గాయకుడు దిల్జిత్‌ దోసాంజ్‌ ఇదివరకే మద్దతు తెలిపారు. రైతుల కోసం ఆయన రూ.కోటి విరాళంగా ప్రకటించడం సహా స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనపై బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌తో పాటు పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. కోటి రూపాయల విరాళం ఇచ్చి కూడా బయటికి చెప్పుకోకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. దీనిపై దిల్జిత్‌ స్పందించారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సకాలంలో పన్ను చెల్లించినందుకు ఆదాయపన్ను శాఖ దిల్జిత్‌ను ప్రశంసిస్తూ ఓ ధ్రువీకరణ పత్రాన్ని ఆయనకు అందజేసింది. ఆ పత్రాన్ని దిల్జిత్‌ ట్విట్టర్‌లో పంచుకున్నారు. “ఇదిగో నా భారత పౌరసత్వానికి రుజువు. ఇలా తన దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. నిజానికి ఇలా పంచుకోవడం నాకూ ఇష్టం లేదు. కానీ.. పరిస్థితుల వల్ల పంచుకోవాల్సి వస్తోంది. ఇకనైనా ద్వేషాన్ని ప్రచారం చేయడం మానుకోండి” అని విమర్శకులను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This