ధోనీ కొట్టిన సిక్సర్​కు​ మురళీ విజయ్ షాక్!

ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న చెన్నై సూపర్​కింగ్స్​ క్రికెటర్లు, గతవారం నుంచి ప్రాక్టీసు మొదలుపెట్టారు. లీగ్​ ప్రారంభానికి మరో 8 రోజులే ఉండటం వల్ల ప్రాక్టీసులో డోసు పెంచారు. గురువారం జట్టులోని ఆటగాళ్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు. కెప్టెన్​ ధోనీ అద్భుతమైన సిక్స్ కొట్టగా, అది చూసి ఆశ్చర్యపోవడం మురళీ విజయ్​ వంతైంది. సీఎస్కే మేనేజర్​ రాధాకృష్టన్​ తీసిన ఆ వీడియోను సీఎస్క్​ ట్వీట్ చేసింది.

ఈ మ్యాచ్​లో లాంగ్​ఆన్​లో ఉన్న మురళీ విజయ్​ మీదుగా ధోనీ సిక్సర్ కొట్టాడు. దాన్ని చూసి.. “అద్భుతమైన టైమింగ్​, బ్యాట్​ స్పీడ్​, స్వింగ్ లాంటి ధోనీకి పుట్టుకతోనే వచ్చాయి. అతడి కంటే బాగా ఆడలేం”​ అని అన్నాడు.

ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఐపీఎల్​లో చెన్నై తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. గత సీజన్​లో 15 మ్యాచ్​లు ఆడి, 134.62 స్ట్రైక్​ రేట్​తో 416 పరుగులను చేశాడు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్​​ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 మధ్య జరగనుంది. గత ఫైనల్​లో తలపడ్డ ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ మధ్య ఇప్పుడు తొలి మ్యాచ్​ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This