కెప్టెన్‌గా గబ్బర్‌.. వైస్‌కెప్టెన్‌గా భువీ

టీమిండియా సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తొలిసారి భారత జట్టు కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియా రెండో జట్టు జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పర్యటనకు వెళ్లే జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించింది. ధావన్‌ కెప్టెన్‌గా.. భువనేశ్వర్‌ ​కుమార్‌ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కొన్నిరోజులగా చర్చ నడుస్తుంది. రెండు రోజల క్రితం గబ్బర్‌ పేరు ఖరారైనట్లు వార్తలు రావడం.. తాజాగా అతనికే పగ్గాలు అప్పజెప్పడంతో చర్చకు బ్రేక్‌ పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This