కోహ్లీని ఈసారి స్లెడ్జింగ్​ చేయను: డేవిడ్​ వార్నర్​

డిసెంబరులో టీమ్‌ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్‌ విరాట్ ‌కోహ్లీపై నోరు జారనని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు వార్నర్​. మరోవైపు ఈ ఏడాది చివర్లో భారత పర్యటన గురించి కూడా స్పందించాడు.

“విరాట్ కోహ్లీని కవ్వించొద్దు. అతడు అలాంటి ఆటగాడు కాదు. ఎలుగుబంటిని రెచ్చగొట్టడంలో అర్థమే లేదు. ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో అతడిని స్లెడ్జింగ్‌ చేయను. 2018-19లో జరిగిన సిరీస్​లో భారత్​ చక్కటి ప్రదర్శన చేసింది. ఆ జట్టు బౌలర్లు చెలరేగడం వల్ల మా జట్టు ఓడిపోయింది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే టెస్టు సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. భారత బ్యాటింగ్‌ లైనప్‌ ప్రస్తుతం పటిష్టంగా ఉంది. వారిని టార్గెట్‌ చేసేందుకు మా బౌలర్లూ సిద్ధంగా ఉన్నారు. అయితే, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆ సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే అవకాశం ఉంది. అయితే భారత్​తో ఆడేప్పుడు ప్రేక్షకులు లేకపోతే బాగోదు”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This