పక్కా ప్రణాళికతోనే ‘ఎర్రకోట’ హింస!

‘గణతంత్ర దినోత్సవం’ రోజు ఎర్రకోట వద్ద జరిగిన హింసాాత్మక ఘటనలు.. పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ట్రాక్టర్​ ర్యాలీ నాడు.. పోలీసుల వైర్​లెస్​​ సెట్​ను చోరీ చేసిన ఓ వ్యక్తి నుంచి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు.

ముందే ఆదేశాలు..

నిందితుడిని హరియాణాకు చెందిన అజయ్​ రాతిగా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి చోరీచేసిన పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే.. విధ్వంసం సృష్టించడానికి సదరు వ్యక్తికి ఆదేశాలు అందినట్లుగా ఔటర్​ డీసీపీ డాక్టర్ ఏ ఖాన్ తెలిపారు. ట్రాక్టర్​ ర్యాలీ మార్గాన్ని ఎర్రకోట వైపు మరల్చి, హింసాత్మక ఘటనలకు పాల్పడాలని నిందితుడికి కొంతమంది సూచించారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఈ విషయాలను నిందితుడు వెల్లడించాడని చెప్పారు.

దొంగతనంతో పాటుగా మూడు కేసులు నిందితుడిపై నమోదు చేశామని పోలీసులు చెప్పారు. సాంకేతిక నిఘా విభాగం సాయంతో అజయ్​ను పట్టుకోగలిగామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This