ఇజ్రాయెల్​పై ప్రతీకారంతోనే దిల్లీలో పేలుడు!

దిల్లీలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణ అనంతరం నిర్ధరణకు వచ్చారు. పేలుడు ప్రదేశంలో నిందితులు వదిలివెళ్లిన లేఖను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకున్నట్లు దిల్లీ పోలీస్​​ స్పెషల్​ సెల్​ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్​ రాయబారిని బెదిరిస్తూ ఆంగ్లంలో ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఇది కేవలం ‘ట్రైలర్’ అని లేఖలో ఉందని చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This