సొట్టబుగ్గలతో బాలీవుడ్​ను మాయచేసిన దీపిక

క్షిణాది గడ్డపై పుట్టి పెరిగిన బాలీవుడ్​ నటి దీపికా పదుకొణే.. చిన్నప్పుడు రాకెట్‌ చేతపట్టి బ్యాడ్మింటన్‌ మైదానంలో మెరుపులు మెరిపించింది. పెద్దయ్యాక వెండితెరకు మారిపోయింది. అక్కడ మాత్రం అమ్మడి సందడి మామూలుగా లేదు. వరుస విజయాలతో దూసుకెళ్లింది. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ తో రూ.200 కోట్లు వసూళ్ల కథానాయికల క్లబ్‌లోకి చేరిపోయింది. ఆపై హాలీవుడ్‌కి కూడా వెళ్లి అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించింది. ఈ మధ్యనే ఓ ఇంటికి ఇల్లాలు కూడా అయ్యింది. బాలీవుడ్‌ నటుడు రణ్​వీర్‌సింగ్‌ను పెళ్లి చేసుకున్న ఈ కన్నడ భామ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

ముద్దుముద్దుగా..

పూర్తి పేరు దీపికా పదుకొణే. ఇంట్లో మాత్రం ముద్దుగా అందరూ దీపి అని పిలుస్తుంటారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో 1986 జనవరి 5న పుట్టింది. దీపిక తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ప్రకాష్‌ పదుకొణే. సొంత రాష్ట్రం కర్ణాటక. తల్లి పేరు ఉజ్వల. ఆమె ఓ ట్రావెల్‌ ఏజెంట్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This