ప్రముఖ కొరియోగ్రాఫర్​ సరోజ్​ఖాన్​కు అస్వస్థత

బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) అస్వస్థతకు గురయ్యారు. సరోజ్ ఖాన్ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ ముంబయి బాంద్రాలోని గురునానక్​ ఆస్పత్రిలో చేరారు. కరోనా నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురికావడం వల్ల అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే కరోనా నిర్ధరణ పరీక్షల్లో సరోజ్​కు నెగెటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

సరోజ్​ ఖాన్​.. తన కెరీర్​ మొత్తంలో 2వేలకు పైగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ‘డోలా రే డోలా’, ‘ఏక్​ డో తీన్’​, ‘యే ఇష్క్​ హాయే’ వంటి ప్రసిద్ధ పాటలకుగానూ మూడు జాతీయ అవార్డులను అందుకున్నారు.

గతంలో మాధురి దీక్షిత్‌, సరోజ్‌ఖాన్‌ కలయికలో వచ్చిన అనేక పాటలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ‘చోలీకే పీచే క్యా హై’ అనే పాట ఇప్పటికీ శ్రోతలను ఊర్రూతలూగిస్తుండటం విశేషం.

ఇటీవల కంగనా రనౌత్​ చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’, మాధురి దీక్షిత్ ‘కలంక్’లో పాటలకు దర్శకత్వం వహించారు సరోజ్​.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This