కరోనా సోకి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్​​ మృతి

కరోనా సోకి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్​​ మృతి

తమిళనాడులో కరోనా కారణంగా ఎమ్మెల్యే అన్బళగన్​ మృతిచెందారు. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన మొదటి శాసనసభ్యుడు ఈయనే. చెన్నైలోని చేపక్కం ఎమ్మేల్యేగా ఉన్న 62 ఏళ్ల అన్బళగన్​.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇవాళ ఉదయం మరణించారు. ఇవాళే(జూన్​ 10) ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం.

2001, 2011, 2016లలో శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన.. ఫిలిం డిస్ట్రిబ్యూటర్​, నిర్మాతగానూ వ్యవహరించారు. తమిళంలో జయం రవితో ఆదిభగవాన్​ చిత్రాన్ని నిర్మించారు. దేశంలో కరోనా సోకి మరణించిన తొలి ఎమ్మెల్యే అన్బళగన్​.

అన్బగళన్​ మృతి పట్ల డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​ విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This