ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ఎల్వర్తి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్​ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మహారాష్ట్రకు చెందిన సికిందర్ సింగ్, అలీఖాన్​ పటాన్​గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This