కొండచరియలు విరిగిపడి 37మంది మృతి

గ్వాటెమాలాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ అధ్యక్షుడు అలెజాండ్రో గ్యామెట్టే తెలిపారు.

మధ్య అమెరికా దేశంలో పర్వత ప్రాంతాలు కూలి ఇళ్లపై పడటం వల్ల.. 25 మంది దుర్మరణం చెందారు. హ్యుహ్యుటెనాంగోలో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల 12 మంది చనిపోయారు.

వారం రోజుల పాటు ఏకబిగిన కురిసిన వర్షాలతో భారీ వరదలు పోటెత్తాయి. ఫలితంగా ఈ ఘటన తలెత్తినట్టు తెలుస్తోంది. అంతకుముందు కూడా ఈ ప్రాంతంలో అక్కడక్కడా చిన్న కొండచరియలు విరిగిపడగా.. 20 మరణాలు సంభవించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This