కుప్పకూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి

అమెరికాలో ఓ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. ఫ్లోరిడా నుంచి బయలుదేరిన టీ-6బీ టెక్సాన్​2 అనే శిక్షణ విమానం అలబామాలోని ఫోలే పట్టణ ప్రాంతంలో కుప్పకూలింది. ఆ వెంటనే మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సమీప ప్రాంతానికి మంటలు వ్యాపించి ఒక ఇల్లు, కొన్ని కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారి జో డార్బీ తెలిపారు.

ఈ ఘటనలో మరణించిన వారి వివరాలు ఇంకా వెల్లడించలేదు. విమానం కుప్పకూలిన ప్రాంతంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కమాండర్​ జాక్ హర్రెల్​ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This