అనుమానాస్పదంగా ప్రముఖ డిజైనర్​ కన్నుమూత

ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ షర్బరి దత్తా గతరాత్రి కోల్​కతాలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. స్నానాల గదిలో విగతజీవిగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. గుండెపోటు కారణంగా మృతి చెంది ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

పోలీసుల కథనం ప్రకారం.. షర్బరి దత్తా శుక్రవారం ఉదయం 12.15 గంటలకు మరణించారు. సమాచారం అందిన వెంటనే కోల్​కతా పోలీస్​ హెడ్​క్వార్టర్స్​కు చెందిన లాల్​బజార్​ బ్రాంచ్​ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చివరిగా ఆమె మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసింది. ఆ తర్వాత రోజు నుంచి ఆమె గదిలో ఒంటరిగా ఉన్నట్లు సమాచారం.

కారణమేంటో..

దత్తా గుండెపోటుతో మరణించిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే ఆమెకు దీర్ఘకాలిక వ్యాధుల లాంటివి లేవని కుటుంబసభ్యులు తెలిపారు. ఫ్యాషన్​ డిజైనర్​ ఆకస్మిక మరణం వెనకున్న కారణాన్ని తెలుసుకోవడానికి కోల్​కతా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దత్తా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.

ప్రముఖ కవి కుమార్తె

ప్రముఖ బెంగాలీ కవి అజిత్​ దత్తా కుమార్తె ఈ షర్బరి దత్తా.. కొన్ని దశాబ్దాలుగా కాస్ట్యూమ్​ డిజైనింగ్​ పరిశ్రమలో, ముఖ్యంగా పురుషుల దుస్తులను డిజైనింగ్​ చేయడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This