పడవ బోల్తా పడి ఒకే కుటుంబంలోని 10 మంది మృతి

పాకిస్థాన్​లోని దక్షిణ సింధ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. తట్టాలోని కీన్​ఝార్​ సరస్సులో ఓ పడవ బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారు ఉన్నారు.

విహార యాత్ర కోసం కీన్​ఝార్​ సరస్సు సమీపంలోని రిసార్టుకు వచ్చింది ఆ కుటుంబం. అక్కడే ఓ పడవ అద్దెకు తీసుకుని సరస్సులో ప్రయాణిస్తుండగా బలమైన గాలుల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

పడవలో 13 మంది ఉండగా ముగ్గురుని స్థానిక ఈతగాళ్లు రక్షించారు. 10 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This