వరద ధాటికి కూలిన వంతెనలు.. ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్​ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన కుండపోత వర్షాల వల్ల వరద పొటేత్తింది. దీంతో పితోర్​గఢ్​ జిల్లాలోని​ గోసీ నదిపై ఉన్న రెండు వంతెనలు మంగళవారం ఉదయం కుప్పకూలిపోయాయి. ఫలితంగా ఆ ప్రాంత ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ముగ్గురు మృతి..

వర్షాల కారణంగా ఇళ్లపై బండరాళ్లు పడటం వల్ల రెండు వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బంగపాణి సబ్​-డివిజన్​లో తల్లి, కొడుకులు మరణించగా.. తేజామ్​ సబ్​-డివిజన్​లో ఓ మహిళ చనిపోయింది.

పితోర్​గఢ్​లో కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జులై 20న తంగా గ్రామంలో 12మంది మృతి చెందారు. జూన్​ చివరలో దఖిమ్​ గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళలు, ఓ చిన్నారితో సహా నలుగురు గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This