ధావన్​ కుటంబంలోకి ఇద్దరు కొత్త సభ్యులు

టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్ ధావన్ కుటుంబంలోకి ఇద్దరు కొత్తసభ్యులు వచ్చారు. వారిని పరిచయం చేస్తూ ఆ ఫొటోలను ట్వీట్ చేశాడు ఈ క్రికెటర్. ఆ శునకాలకు ‘చోలే’, ‘వ్యాలంటైన్’​ అని పేర్లు పెట్టాడు. వీటిని తాను దత్తత(పెంచుకోవడం)తీసుకున్నట్లు వెల్లడించాడు​. ఇక నుంచి ఇవీ తన కుటంబం సభ్యులని రాసుకొచ్చాడు.

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన ధావన్.. ఆన్​లైన్​ లైవ్​సెషన్స్​లో చురుగ్గా పాల్గొంటున్నాడు. మిగతా క్రికెటర్లందరు పోస్ట్​లపై స్పందిస్తూ, హాస్యభరిత కామెంట్లు చేస్తున్నాడు. ఇటీవలే హార్దిక్ పాండ్య, తాను వండిన వంటకాన్ని ఇన్​స్టాలో అభిమానులతో పంచుకోగా.. దానిపైనా కామెంట్ చేశాడు.

గాయంతో కొంతకాలం ఇంటికే పరిమితమైన శిఖర్.. ఐపీఎల్​లో అదరగొట్టి జాతీయ జట్టులోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే కరోనా వల్ల ఐపీఎల్​ సీజన్ నిరవధిక వాయిదా పడింది. టోర్నీలో ధావన్.. దిల్లీక్యాపిటల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This