‘ఆ సమయంలో ధోనీ మద్దతుగా నిలిచాడు’

టీమ్​ఇండియా స్టార్​ ఓపెనర్​ శిఖర్​ ధావన్… మహేంద్ర సింగ్​​ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం అభిమానులతో ట్విట్టర్​ వేదికగా ముచ్చటించిన గబ్బర్​.. మహీ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. 2013 ఛాంపియన్స్​ ట్రోఫీ వార్మప్​ మ్యాచ్​ల సమయంలో పరుగులు చేయలేకపోయినా.. ధోనీ మద్దతుగా నిలిచినట్లు చెప్పుకొచ్చాడు.

ఆ టోర్నీలో భారత్​ ఒక్క మ్యాచ్​ ఓడిపోకుండా టైటిల్​ గెలవడం గర్వకారణంగా అభివర్ణించాడు ధావన్​. జట్టుగా రాణించడం వల్లే అద్భుతమైన విజయం సాధించామని గుర్తుచేసుకున్నాడు​.

సచిన్​ వంటి దిగ్గజంతో ఆడటం తన డ్రీమ్​ అని.. అది నెరవేరిందని చెప్పుకొచ్చాడు ధావన్​. మాస్టర్​ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు.

గబ్బర్​ పేరు ఎలా వచ్చిందంటే..?

భారత మాజీ కీపర్​ విజయ్​ దహియా.. గబ్బర్​ అనే పేరు పెట్టినట్లు చెప్పాడు ధావన్​. దానికి కారణాన్ని వివరించాడు. ఫీల్టింగ్​ సమయంలో అందర్నీ నవ్వించడానికి గబ్బర్​ డైలాగ్​లు చెప్పేవాడినని పేర్కొన్నాడు. అలా తనకు ఆ పేరు పెట్టినట్లు వెల్లడించాడు.

యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 19 నుంచి నవంబర్​ 8 వరకు జరగనున్న ఐపీఎల్​లో.. దిల్లీ క్యాపిటల్స్​ తరఫున బరిలోకి దిగనున్నాడు శిఖర్​ ధావన్​.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This