హాలీవుడ్ చిత్రానికి ప్రియదర్శి డబ్బింగ్..

హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. అందుకు అనుగుణంగానే భారీ బడ్జెట్ చిత్రాలను పక్కా ప్రమోషన్స్​తో భారత ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగా ఇక్కడి నటులతో డబ్బింగ్ చెప్పించడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ‘లయన్ కింగ్’​లోని పాత్రలకు నాని, జగపతిబాబు, బ్రహ్మానందం వంటివారు తమ గొంతు అరువిచ్చారు.

తాజాగా ‘ఫ్రోజెన్​ 2’ లోని ఎల్సా పాత్ర కోసం నిత్యామీనన్​ డబ్బింగ్ చెప్పనుంది. ఇప్పుడు ఈ లిస్టులో ప్రియదర్శి కూడా చేరిపోయాడు. ఇదే చిత్రంలోని ఐకానిక్ పాత్ర అయిన ఫన్నీ స్నో మ్యాన్​ ఒలఫ్​కు డబ్బింగ్ చెప్పనున్నాడీ హాస్యనటుడు.

డిస్నీ రూపొందించిన యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్’ 2013లో విడుదలై ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. ఆ ఏడాది ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​గా ‘ఫ్రొజెన్ 2’ను తీసుకురానున్నారు. ఈ మూవీ ఈనెల 22న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This