సీఎస్కేకు ఈ ఏడాది కలిసిరాలేదు: ధోని

ముంబయి జట్టుతో జరిగిన మ్యాచ్​లో ఘోరంగా ఓటమిపాలైంది చెన్నై సూపర్​ కింగ్స్. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎస్కే కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోని.. ఈ ఓటమి చాలా బాధకలిగించిందన్నాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఈ ఏడాది తమ జట్టుకు కలిసి రాలేదన్నాడు. ఈ ఐపీఎల్​ సీజన్​లో తమ ప్రదర్శన పేలవంగా ఉందని చెప్పాడు.

“ప్రతీ మ్యాచ్​లో అనుకున్నవిధంగా రాణించలేం. రానున్న మూడు మ్యాచ్​ల్లోనైనా బాగా ఆడాలని ఆశిస్తున్నా. పరుగులు తీయడంలో బ్యాట్స్​మెన్ నిరాశపరిచారు. టాప్​ ఆర్డర్​ ఆటగాళ్లు వరుసగా పెవీలియన్​ చేరడం వల్ల మిడిలార్డర్​ బ్యాట్స్​మెన్​పై ఒత్తిడి పెరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టుకు కాస్త అదృష్టం తోడవ్వాలి. కానీ మా విషయంలో అది జరగలేదు. ఈ ఐపీఎల్​ సీజన్​లో ఘోరంగా విఫలమయ్యాం”.

ధోని, చెన్నై సూపర్​ కింగ్స్ జట్టు కెప్టెన్.

తేమతో తప్పని ఇబ్బంది

ఛేదనలో పిచ్​పై తేమ తక్కువగా ఉండేదని.. కానీ, ఈసారి తొలుత బ్యాటింగ్​ చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ధోని అన్నాడు. పేలవ ప్రదర్శన కనబరిచినప్పుడు దాని వెనక చాలా కారణాలు ఉంటాయని పేర్కొన్నాడు.

“జట్టులో నలుగురు బ్యాట్స్​మెన్​ విఫలమైతే.. ఆ పరిణామాలను ఎదుర్కోవడం చాలా కష్టం. పరువును దృష్టిలో పెట్టుకునైనా రానున్న మూడు మ్యాచ్​లు గెలవాలని ఆశిస్తున్నాం. వచ్చే ఏడాదికి మంచి ప్రణాళిక అవసరం. యువ ఆటగాళ్లకూ ఆవకాశం ఇవ్వడం ముఖ్యం”.

-ధోని, సీఎస్కే కెప్టెన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This