అమెరికాలో సైనికాధికారి పేరిట రూ.1.24 కోట్లు టోకరా

హరియాణా గురుగ్రామ్​లోని చకర్​పుర్​ గ్రామానికి చెందిన ధీరేంద్ర​ కుమార్​… సైబర్​ మోసానికి గురై రూ.1.24 కోట్లు పోగొట్టుకున్నాడు. పునామ్​మెకేలా ​ పేరుతో వచ్చిన మెసేజ్​లను నమ్మిన ఆయన భారీ మొత్తంలో సొమ్మును పోగొట్టుకున్నాడు.

సందేశం పంపి…

ధీరేంద్ర​ కుమార్​కు… పునామ్​ మెకేలా పేరుతో వాట్సాప్​కు ఓ సందేశం వచ్చింది. తెరిచి చూస్తే ‘అమెరికాలో సైనికాధికారిణిగా పని చేస్తున్న తాను… భారత్​లో ఔషధ సంస్థను స్థాపించాలనుకుంటున్నాను. దీని కోసం 8.7మిలియన్​ డాలర్లు మీకు పంపుతాను’ అని అందులో ఉంది. ఆ తర్వాత అమెరికా నుంచి ఓ బాక్సు రాగా.. దానికి కొంత డబ్బు చెల్లించాలంటూ… 2020 జూన్​ 19 నుంచి జులై 17 వరకు పలు మెసేజ్​లు వచ్చాయి. దీంతో ఆన్​లైన్​ ద్వారా డబ్బు చెల్లించినట్లు ధీరేంద్ర పేర్కొన్నాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… పునామ్​ మెకేలా పేరుతో మెసేజ్​లు పంపిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు ఇటువంటి సైబర్ ​మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు గురుగ్రామ్​ పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This