‘నీ భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు’

” ప్రేమించానన్నాడు. నువ్వే సర్వస్వమన్నాడు. కాదంటే..  చచ్చిపోతానన్నాడు. నిన్ను, నీ వాళ్లను పువ్వుల్లో పెట్టి సాక్కుంటానని నమ్మబలికాడు. ఇలా ఏడాది పాటు ఆమె చుట్టూ తిరిగాడు. ఇక ఆమె కాదనలేకపోయింది.  కుటుంబ సభ్యులను ఒప్పించి అతన్ని మనువాడింది. కానీ ఐదేళ్ల తర్వాత అతని నిజ స్వరూపం బయటపడింది.” ఇప్పుడు ఆమె న్యాయం కోసం వేడుకుంటోంది.

ఇందుకు సంబంధించిన వివరాలు… ఆళ్లగడ్డ  మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన ఓబులేసు జియో ఫైబర్‌ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడు. ఈ క్రమంలో భర్త చనిపోయి ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటిలో ఉంటున్న ఇంటి యజమాని కుమార్తె  విజయ సునీల్‌ అగర్వాల్‌పై కన్నేశాడు. ఆమెతో  పరిచయం పెంచుకున్నాడు. కాస్త చనువు ఏర్పడ్డాక ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె.. అతన్ని మందలించింది. అయినా వినకుండా వెంటపడ్డాడు. ఆమెతో పాటు పిల్లలను,  తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని నమ్మబలికాడు.  నీవు లేకుంటే  చచ్చిపోతానని బెదిరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This