ఆటలో ఓడించిందని బాలికను చంపేసిన బాలుడు!

మధ్యప్రదేశ్ ఇందోర్​లో దారుణం జరిగింది. ఓ 11 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల బాలికను కిరాతకంగా హత్య చేశాడు.

ఇందోర్, లాసుడియాలో సోమవారం ఓ బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. లాసుడియాలోని, ఓ కాలనీకి చెందిన బాలుడిని అదే కాలనీలోని మరో బాలిక ఓ ఆన్​లైన్ ఆటలో పలుమార్లు ఓడించింది. దీంతో కక్ష పెంచుకున్న బాలుడు.. ఆ బాలికను తలమీద రాళ్లతో కొట్టి చంపేశాడు.

“లాసుడియా ప్రాంతంలో ఓ 11 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల బాలికను కిరాతకంగా హత్య చేశాడు. బాలికను తమ ఇంటికి సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. రాళ్లతో తలపై బాది చంపేశాడు.”

-హరినారాయణ్ చారి మిశ్రా, ఇందోర్ ఐజీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This