2019.. టీమిండియా ‘హ్యాట్రిక్’ సంవత్సరం

బంగ్లాదేశ్​తో జరిగిన చివరి టీ20లో టీమిండియా గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్​లో యువ బౌలర్ దీపక్ చాహర్ హ్యాట్రిక్​తో పాటు మొత్తం ఆరు వికెట్లు తీసి భారత్​ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా టీ20ల్లో రికార్డు నమోదు చేశాడు. ఈ ఏడాది టీ20లతో పాటు వన్డే, టెస్టుల్లోనూ హ్యాట్రిక్​ సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది.

దీపక్ చాహర్ (టీ20)

బంగ్లాతో జరిగిన మ్యాచ్​లో చివర్లో షఫియుల్‌, ముస్తాఫిజుర్‌, అమినుల్‌ ఇస్లామ్‌ను వరుస బంతుల్లో ఔట్‌చేసి దీపక్ చాహర్‌ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 7 పరుగులకే 6 వికెట్లు తీసి టీ20 చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

బుమ్రా (టెస్టు)

టీమిండియా స్పీడ్ స్టార్​ జస్ర్పీత్ బుమ్రా వెస్టిండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​లో హ్యాట్రిక్ సాధించాడు. వరుసగా బ్రూక్స్, రోస్టర్ ఛేజ్, డారెన్​ బ్రావోలను పెవిలియన్ చేర్చి ఈ ఘనత సాధించాడు. ఫలితంగా టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్​గా నిలిచాడు. ఇతడికంటే ముందు హర్భజన్ సింగ్, ఇర్భాన్ పఠాన్​ ఈ క్లబ్​లో చేరారు.

షమీ (వన్డే)

ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్​లో అఫ్గానిస్థాన్​పై హ్యాట్రిక్ నమోదు చేశాడు మహ్మద్ షమీ. వరుసగా మహ్మద్ నబీ, అఫ్తాబ్ ఆలమ్, ముజిబుర్ రెహ్మన్​లను ఔట్ చేశాడు. ఫలితంగా 32 ఏళ్ల తర్వాత ప్రపంచకప్​లో హ్యాట్రిక్​ తీసిన భారత బౌలర్​గా నిలిచాడు. 1987లో న్యూజిలాండ్​తో జరిగిన వరల్డ్​కప్​ మ్యాచ్​లో చేతన్ శర్మ ఈ ఘనత సాధించాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This